Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా ప్రజలను భయపెడుతున్న ఐస్ డిస్క్.. ఏం చేస్తుందో?

అమెరికా ప్రజలను భయపెడుతున్న ఐస్ డిస్క్.. ఏం చేస్తుందో?
, శనివారం, 15 జనవరి 2022 (11:15 IST)
ice disk
అమెరికా ప్రజలను తాజాగా ఐస్ డిస్క్ భయపెడుతోంది. ఇది గాల్లో ఎగరదు. నీటిపై వలయాకారంలో తిరుగుతూ ఉంటుంది. భారీ వృత్తాకారంలో ఉండే మంచుగడ్డను కొందరు ప్రకృతే అలా చెక్కిందని అంటుంటే.. కొందరు మాత్రం అది తప్పకుండా గ్రహాంతరవాసుల రాకను సూచిస్తోందని అంటున్నారు.  
 
సాధారణంగా చలికాలంలో అమెరికాలోని చాలా నదులు గడ్డ కట్టేస్తుంటాయి. వెస్ట్‌బ్రూక్ నగరంలోని ప్రీసంప్‌స్కాట్ నదిలో కూడా అదే జరిగేది. అయితే, 2019లో మాత్రం.. నదిలో గడ్డకట్టిన నీరు గుండ్రంగా తిరుగుతూ కనిపించింది. అప్పట్లోనే చాలామంది దాన్ని గ్రహాంతరవాసుల పనేనని అనుకున్నారు.
 
2020లోని వింటర్ సీజన్లో మాత్రం అది మళ్లీ ఆ తరహాలో కనిపించలేదు. తాజాగా మరోసారి ఈ భారీ డిస్క్ ప్రత్యక్షమైంది. నీటిపై తేలుతున్న ఈ ఐస్ డిస్క్‌ను చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
 
దీనిపై నిపుణులు స్పందిస్తూ.. నది లోపల ఏర్పడే కరెంట్ (ప్రవాహం), సుడిగుండాల వల్ల ఈ డిస్క్ ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. నది సుడులు తిరుగుతున్నప్పుడు నీరు క్రమేనా గడ్డకట్టి ఉంటుందని, అందుకే అది అలా గుండ్రంగా కట్ చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ఆ ఐస్ గడ్డ మీదకు ఎక్కేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు