Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

us girl jaw

ఠాగూర్

, బుధవారం, 15 మే 2024 (15:42 IST)
అమెరికాలో ఓ యువతి దవడ లాక్ అయిపోయింది. దీనికి కారణం ఆమె పెద్దగా ఆవలించడమే. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేసి దవడను సరిచేయాల్సివచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జెన్నా సినాట్రా అనే 21 ఏళ్ల యువతి సోషల్ మీడియాలో మంచి పాపులర్ పర్సన్‌గా ఉన్నారు. ఈమెకు ఆవలింత రావడంతో ఆమె పెద్దగా నోరు తెరించింది. దీంతో ఆమె దవడ ఒక్కసారిగా లాక్ అయిపోయింది. తిరిగి నోరు మూతపడకుండా అలాగే ఉండిపోయింది. దీంతో ఆమె బాధతో విలవిల్లాడింది. అలా నోరు పెద్దగా తెరుచుకొని ఉన్న స్థితిలోనే ఆసుపత్రికి పరిగెత్తింది. 
 
తన సమస్యను వైద్యులకు వివరించేందుకు నోరు పెగలక పోవడంతో ఓ బంధువు సాయం తీసుకుంది. దీంతో అవాక్కయిన డాక్టర్లు ఆమెకు తొలుత ఎక్స్‌రే తీశారు. ఆమె బలంగా ఆవలించడం వల్ల దవడ ఎముక పక్కకు జరిగిందని గుర్తించారు. కొన్ని గంటలపాటు మరికొన్ని పరీక్షల తర్వాత చికిత్స ప్రారంభించారు. ఆమెకు నొప్పి తగ్గడానికి ముందుగా నోటికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. 
 
చివరకు తల నుంచి దవడ దాకా పెద్ద కట్టు కట్టారు. దీంతో ఆమె దవడ తిరిగి పాత స్థానంలోకి వచ్చింది. తన చికిత్సకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఏకంగా 24 లక్షల వ్యూస్ లభించాయి. ఆమె పరిస్థితిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంత అందమైన అమ్మాయికి ఎంత కష్టం వచ్చిపడిందంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ఆ సమస్య ఎదురైతే ఆమె లాగా ప్రశాంతంగా ఉండేవాడిని కాదంటూ మరొకరు కామెంట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..