Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగా సర్వీస్ క్యాంపును తిరుపతికి తీసుకువస్తోన్న జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్

Jawa Yezdi Motorcycles

ఐవీఆర్

, గురువారం, 9 మే 2024 (22:43 IST)
జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్ తమ అత్యంత విజయవంతమైన మెగా సర్వీస్ క్యాంప్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి తీసుకువస్తోంది. ఈ కార్యక్రమం తిరుపతిలో మే 10 నుండి మే 11 వరకు జరుగుతుంది. దీని ద్వారా ఈ ప్రాంతంలోని 2019, 2020 మోడల్‌ల జావా మోటర్‌సైకిల్ యజమానులకు ప్రత్యేకంగా సేవలను అందించనున్నారు. ఈ సేవా శిబిరం తిరుపతిలో జోష్ మోటో- 100 సెంట్స్, వార్తా పత్రిక కార్యాలయం ఎదురుగా, నారాయణాద్రి హాస్పిటల్ ఎదురుగా, రేణిగుంట రోడ్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, తిరుపతి సబ్ రెజిన్ వద్ద నిర్వహించబడుతుంది. 
 
ఈ శిబిరంలో భాగంగా, 2019-2020 జావా మోటర్‌సైకిళ్ల యజమానులు సమగ్ర వాహన ఆరోగ్య తనిఖీకి, ఎంపిక చేసిన విడిభాగాలను ఉచితంగా పొందడానికి అర్హులు. జావా యెజ్డీ మోటర్‌సైకిళ్ల యజమానులు తమ వాహనాల సర్వీసింగ్ కోసం సమీప బ్రాండ్ డీలర్‌షిప్‌లో తమ స్లాట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోల్డ్ కంటే సిల్వర్ ధరలు పెరగవచ్చు: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్