Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తర కొరియాను సర్వనాశనం చేద్దాం.. రాకెట్‌మ్యాన్‌కు చుక్కలు చూపిద్దాం: ట్రంప్

ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాల్సిందిగా ఇటీవల అమెరికా ఐరాస భద్రతా మండలిలో చేసిన‌ ముసాయిదా తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.

Advertiesment
ఉత్తర కొరియాను సర్వనాశనం చేద్దాం.. రాకెట్‌మ్యాన్‌కు చుక్కలు చూపిద్దాం: ట్రంప్
, బుధవారం, 20 సెప్టెంబరు 2017 (10:31 IST)
ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాల్సిందిగా ఇటీవల అమెరికా ఐరాస భద్రతా మండలిలో చేసిన‌ ముసాయిదా తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఐరాస సదస్సులో మాట్లాడిన ట్రంప్ ఉత్తర కొరియా నియంత కిమ్‌ను తొక్కేసేందుకు తమతో చేతులు కలపాలని కోరారు.

అంతేకాదు ఉత్తరకొరియా, ఇరాన్, వెనిజులాలలో నెలకొన్న సంక్షోభంపై ప్రపంచ దేశాల అధినేతలు చర్చలు జరపాలని
సూచించారు. తమ ఉనికి కోసం నిత్యం దాడులు జరిపే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్ని ఓడిపోయిన వారిగా అభివర్ణించారు. 
 
కొరియా లాంటి కొన్ని దుష్ట దేశాలు భూగ్రహానికి ఉపద్రవంలా మారాయని, అణుబాంబులు వేస్తామని బెదిరిస్తూ ప్రపంచదేశాలనేకాక సొంత ప్రజలను కూడా ఆ రాకెట్‌మ్యాన్‌ (కిమ్‌ జాంగ్‌ ఉన్‌) ఇబ్బందులు పెడుతున్నాడని ట్రంప్ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం తొలిసారిగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. 
 
క్షిపణి పరీక్షలు జరుపకుండా ఉండేలా కొరియాపై ప్రపంచదేశాలు ఒత్తిడి తేవాలని కోరారు. ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ తన పొరుగు దేశాలను బెదిరిస్తే, ఆ దేశాన్ని అమెరికా సర్వనాశనం చేయవచ్చునని ట్రంప్ హెచ్చరించారు. అమెరికాకు గొప్ప బలం, సహనం ఉన్నాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ వ్యభిచారం చేయమంటోంది.. నాన్న ప్రోత్సహిస్తున్నాడు...