మరో వివాదంలో ట్రంప్

బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (05:45 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఓ కార్యక్రమంలో జాతీయ గీతం వస్తుండగా అందరు నిలబడి ఉండగా.. ట్రంప్ మాత్రం ఆర్కెస్ట్రా వాయిస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియలో ట్రంప్ బ్లాక్ సూట్ వేసుకుని రెడ్ టై కట్టుకుని కచేరి మాస్టర్ లా చేతులు ఊపుతున్నాడు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ట్రంప్ జాతీయ గీతాన్ని అపహస్యం చేస్తున్నారని ఒకరు. ట్రంప్ కు దేశభక్తి లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం డ్యూటీలో ప్రాణాలు కోల్పోతే.. పారిశుధ్య కార్మికులకు రూ.కోటి పరిహారం... ఆప్ మేనిఫెస్టో విడుదల