Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరలోనే ఒమిక్రాన్ తోకముడుస్తుంది : ఆంటోనీ ఫౌచి

Advertiesment
త్వరలోనే ఒమిక్రాన్ తోకముడుస్తుంది : ఆంటోనీ ఫౌచి
, సోమవారం, 3 జనవరి 2022 (15:04 IST)
ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఒమిక్రాన్ వైరస్ త్వరలోనే తోకముడుస్తుందని అమెరికాకు చెందిన ప్రముఖ అటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒమిక్రాన్ వైరస్ తొలుత సౌతాఫ్రికాలో వెలుగు చూసిందన్నారు. ఆ తర్వాత శరవేగంగా వ్యాపించిందని గుర్తుచేశారు. 
 
అయితే, ఆ దేశంలో ఒమిక్రాన్ పుట్టుక, కేసుల పెరుగుదల, కేసుల తగ్గుదల, ఇతర అనుభవాలను నిశితంగా పరిశీలిస్తే, అత్యంత వేగంగా పెరిగిన ఒమిక్రాన్ వైరస్.. స్వల్ప కాలంలోనే తగ్గుముఖం పట్టిందని చెప్పరు. ఇదే పరిస్థితిని అమెరికాలోనూ చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పైగా, విద్యార్థులను పాఠశాలలకు పంపించే విషయంలో పెద్దగా సమస్యలేవీ ఉత్పన్నం కాబోవని చెప్పారు. 
 
అంతేకాకుండా, డెల్టా వైరస్‌తో పోలిస్తే ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం ఒమిక్రాన్ వైరస్‌లో తక్కువేనని చెప్పారు. అదేసమయంలో డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ ఎన్నో రెట్లు అధికంగా కేసులు వచ్చినపుడు ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతుందని ఆయన వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌కు 190 ఏళ్ల జైలు శిక్ష