Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉగ్రవాదులపై బాలిక ప్రతీకారం.. ఏకే 47తో గుండ్లవర్షం.. ఇద్దరు మృతి

Advertiesment
ఉగ్రవాదులపై బాలిక ప్రతీకారం.. ఏకే 47తో గుండ్లవర్షం.. ఇద్దరు మృతి
, బుధవారం, 22 జులై 2020 (11:29 IST)
ఉగ్రవాదులపై ఓ ఆఫ్ఘనిస్థాన్ బాలిక ప్రతీకారం తీర్చుకుంది. తన తల్లిదండ్రులను దారుణంగా కాల్చి చంపేసిన ఉగ్రవాదులపై సాహసంగా పోరాడిన ఆ బాలిక ఉగ్రమూకలను తుపాకీతో కాల్చిపారేసింది.

ఏకే 47 తీసుకుని ఆ ఉగ్రవాదులపై గుండ్లవర్షం కురిపించింది. ఈ ఘటనలో ఇద్దరు తాలిబాన్‌ ఉగ్రవాదులు చనిపోగా.. అనేక మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటన మధ్య ప్రావిన్స్ ఘోర్‌లోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. స్థానిక ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు ఉగ్రవాదులు ఆ బాలిక తండ్రిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. అతని భార్య ఉగ్రవాదులను ఎదురించింది. దాంతో..కోపానికి గురైన ఆ ఉగ్రవాదులు ఆ బాలిక తల్లిదండ్రులను చంపేశారు.

ఇంట్లో ఉండి ఆ ఘటనను కళ్లారా చూసిన వారి కూతురు కమర్‌గుల్‌.. అక్కడే పడివున్న ఏకే 47 తుపాకీని తీసుకుని ఉగ్రవాదులను కాల్చింది. అలాగే పక్కనే ఉన్నవారిపై కూడా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు తాలిబాన్‌ ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోగా... పలువురు గాయపడ్డారు.
 
కమర్‌గుల్‌ కాల్పులు జరిపిన విషయాన్ని స్థానిక పోలీసు హెడ్ హబీబురాహ్మాన్ మాలెక్జాడా ధ్రువీకరించారు. అయితే.. కమర్‌ సాహసాన్ని ఆప్ఘనిస్థాన్ప్రభుత్వం ప్రశంసించింది. అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని.. అక్కా తమ్ముళ్లను తన భవనానికి కూడా ఆహ్వానించారు. వారికి భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కొత్తగా 37,148 కరోనా పాజిటివ్ కేసులు