Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీనేజ్ పిల్లల్లో విచిత్రమైన ప్రవర్తనకు కారణమేంటి?

టీనేజ్ పిల్లల్లో విచిత్రమైన ప్రవర్తనకు కారణమేంటి?
, శుక్రవారం, 12 జూన్ 2020 (23:00 IST)
టీనేజ్ పిల్లల్లో సాధారణంగా పేరెంట్స్‌తో ఘర్షణ పడే పరిస్థితి ఉంటుంది. తమకి అన్ని తెలుసునని, అన్నీ చేయగలమని, తమకు ఎవరూ ఏమీ చెప్పనవసరం లేదని అనుకుంటుంటారు. ఈ పరిస్థితి వల్ల చాలా సంధర్భాల్లో పేరెంట్స్ మాట వినరు. దాంతో పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య ఘర్షణ తలెత్తుతుంది.
 
టీనేజ్ పిల్లల్లో ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆ వయస్సులో పెంపొందడమే ఒక ప్రధాన కారణం. దానికి తోడు దేనినైనా చేసేయగలమనే సాహస ప్రవృత్తి కూడా ఉంటుంది. దాంతో వారిలో దూకుడు స్వభావం చోటు చేసుకుంటుందట. మరికొంతమంది పిల్లలు సహజంగా ఉండే టీనేజ్ పిల్లలకి భిన్నంగా ఉంటారు. ఆ భిన్నత్వం మామూలుగా ఉంటే ఫర్వాలేదు. ఆ విలక్షణత స్థితి పేరెంట్స్‌ని కలవరపరుస్తుంది. దానికి కారణం ఇటువంటి టీనేజ్ పిల్లల్లో అంతుపట్టని దిగులు విచారం నెలలు తరబడి ఉంటుంది.
 
వాళ్లలో ఎటువంటి హుషారు ఉండదు. వాళ్ళలో ఏదో చేయాలనే ఉత్సాహం ఉండదు. పైగా ఈ జీవితం దండుగనే భావం తరచు వాళ్ళ మాటల్లో వ్యక్తమవుతుంది. ఏ విషయం మీదా ఆశక్తి ఉండదు. పైగా చనిపోవాలనే ఆలోచన తరచూ కలుగుతూ ఉంటుంది. టీనేజర్స్ లోని ఈ విలక్షణ పరిస్థితినే ఎడాలసెంట్ డిప్రెషన్ అంటారు. 15-24 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో సంభవిస్తున్న మరణాల్లో ఆత్మహత్య చేసుకోవడం మూడవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 
 
చాలామంది పెద్దవాళ్ళు పిల్లల్లోని ఈ విలక్షణత పరిస్థితికి కారణం వాళ్ళ మానసిక బలహీనత అనుకుంటారు. కాని అదొక మానసిక వ్యాధి అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి నలుగురు అమ్మాయిలలో అలాగే ప్రతి 8 మంది అబ్బాయిలలో ఒకరికి ఎడాలసెంట్ డిప్రషన్ ఎక్కువ స్థాయిలోనూ లేదా తక్కువ స్థాయిలోనూ ఉంటుంది. ఎడాలసెంట్ డిప్రెషన్ గురైన పిల్లల్లో కేవలం 33శాతం మందే మెడికల్ హెల్ప్ పొందడం ఉంటోంది.
 
కానీ పెరేంట్స్ వాళ్ళలోని విలక్షణత పరిస్థితిని జాగ్రత్తగా గమనించినట్లయితే 80 శాతం మందికి చికిత్స చేసి మామూలుగా మార్చేయవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహ రోగులను ఇబ్బందిపెట్టే ఎముక పగుళ్లు