Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం పూర్తి

అనారోగ్యంతో బుధవారం శివైక్యం పొందిన కంచి కామకోటి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గురువారం మహాసమాధి అయ్యారు. కంచి కామకోటి మఠం ప్రాంగణంలోనే ఆయన బృందావన ప్రవేశం చేశారు. కొంతకాలంగా రక్తపోటు, తీవ్ర మధుమేహం,

జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం పూర్తి
, గురువారం, 1 మార్చి 2018 (10:46 IST)
అనారోగ్యంతో బుధవారం శివైక్యం పొందిన కంచి కామకోటి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గురువారం మహాసమాధి అయ్యారు. కంచి కామకోటి మఠం ప్రాంగణంలోనే ఆయన బృందావన ప్రవేశం చేశారు. కొంతకాలంగా రక్తపోటు, తీవ్ర మధుమేహం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన రోజూలాగానే బుధవారం ఉదయం కూడా 7.10 గంటల వరకూ భక్తులకు దర్శనమిచ్చిన ఆయన.. అంతలోనే అస్వస్థతకు గురయ్యారు. బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే స్పృహతప్పి పడిపోయారు. 
 
ఆ వెంటనే ఆయన శిష్య బృందం స్వామీజీని సమీపంలోని ఏబీసీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు స్వస్థత చేకూర్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. గుండెపోటుతో ఆయన ఉదయం 9 గంటలకు నిర్యాణం చెందినట్టు మఠం నిర్వాహకులు ప్రకటించారు. ఆయన వయసు 82 యేళ్లు. 
 
ఆ తర్వాత జయేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని గురువారం ఉదయం వరకు భక్తుల దర్శనార్థం ఉంచారు. అనంతరం మఠంలోనే ఆయన శిష్య బృందంతో పాటు.. ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో బృందావన ప్రవేశ క్రతువును పూర్తిచేశారు. 
 
చంద్రశేఖరేంద్ర స్వామి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశమయ్యారు. మహాసమాధి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, డాలర్‌ శేషాద్రి, తితిదే మాజీ ఈవో కనుమూరి బాపిరాజు తదితరులు జయేంద్ర సరస్వతికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తమోడుతున్న సిరియా.. గజగజ వణుకుతున్న గౌటా