Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్యా యుద్ధ నౌకా...? అయితే ఏంటి? ఉక్రెయిన్ సైనికుల ప్రాణత్యాగం

Advertiesment
Snake Island
, శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (16:45 IST)
ఉక్రెయిన్ సైనికులు వీరోచితంగా పోరాడుతున్నారే గానీ, రష్యా సైనికులకు ఒక పట్టాన లొంగడం లేదు. తాజాగా స్నేక ఐలాండ్ వద్ద జరిగిన ఓ సంఘటన ఇపుడు ప్రతి ఒక్కరినీ కన్నీరుపెట్టిస్తుంది. ఉక్రెయిన్ సైనికుల వీరోచిత పోరాటాన్ని ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. 
 
నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్ ఐలాండ్ ఉంది. దీన్నే స్థానికంగా జ్మినిల్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఈ దీవిలో ఉక్రెయిన్‌కు చెందిన సైనిక స్థావవరం ఉంది. తాము ఉక్రెయిన్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటామని చెబుతున్న రష్యా.. స్నేక్ ఐలాండ్‌లోని మిలిటరీ కేంద్రంపైనా దృష్టిసారించింది. నల్ల సముద్రంలోని ఓ రష్యా యుద్ధ నౌక స్నేక్ ఐలాండ్ సమీపంలో మొహరించింది. ఆ నౌక అధికారి.. దీవిలో ఉన్న ఉక్రెయిన్ సైనికులకు గట్టిగా హెచ్చరిక పంపాడు. 
 
"ఇది సైనిక యుద్ధ నౌక. రష్యాకు చెందిన సైనిక యుద్ధనౌక. రక్తపాతాన్ని నివారించడానికి వీలుగా మీరు మీ ఆయుధాలను కిందపడేసి మాకు లొంగిపోండి. లేకిపోతే మీపై బాంబుల వర్షం కురిపిస్తాం" అని ఆ రష్యా అధికారి స్పష్టం చేశాడు. అయితే అవతిలివైపు నుంచి ఏమాత్రం లెక్క చేయని రీతిలో ధీటైన సమాధానం వచ్చింది. రష్యా యుద్ధ నౌకా? అయితే, ఏంటి? అంటూ ఓ బూతు మాటను జోడించి ఉక్రెయిన్‌ సైనికుడు ఘాటుగా బదులిచ్చాడు. 
 
అక్కడ జరిగిన సంభాషణలో ఇవే ఆఖరి మాటలు. ఆ తర్వాత రష్యా యుద్ధనౌక నిప్పుల వర్షం కురిపించగా, స్నేక్ ఐలాండ్‌లో ఉన్న ఉక్రెయిన్ సైనికులు 13 మంది వీరమరణం చెందారు. ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారేగానీ రష్యాకు మాత్రం ఏమాత్రం లొంగిపోలేదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వీరమరణంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భావోద్వేగభరితంగా స్పందించారు. స్నేక్ ఐలాండ్‌లోని సరిహద్దుల వద్ద మా గార్డులు అందరూ వీరోచితంగా పోరాడి వీరమరణం చెందారు. ధైర్యంగా మృత్యువును ఆహ్వానించారే తప్ప ఓటమిని అంగీకరించలేదు. వారికి మరణానంతరం హీరో ఆఫ్ ఉక్రెయిన్ పురస్కారాలు అందజేస్తాం అని ప్రకటించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే?