Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్యా దాడిలో ఐదుగురు ఉక్రెయిన్ సైనికులు మృతి

Advertiesment
రష్యా దాడిలో ఐదుగురు ఉక్రెయిన్ సైనికులు మృతి
, మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (07:59 IST)
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైనట్టుగా కనిపిస్తుంది. తాజాగా రష్యా సైనికులు జరిపిన దాడిలో ఐదుగురు ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
మరోవైపు, ఉక్రెయిన్ సేనలు తమ భూభాగంలోకి చొరబడ్డాయని రష్యా ఆరోపించగా, అదేమీ లేదంటూ ఉక్రెయిన్ స్పష్టం చేసింది. అయితే ఉక్రెయిన్ సేనలు తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చినందుకే ఆ దేశ సైనికులను హతమార్చినట్టు రష్యా అధికారులు వెల్లడించడం గమనార్హం. 
 
మరోవైపు, ఈ యుద్ధాన్ని నివారించేందుకు మధ్యవర్తిత్వం జరిపేందుకు సిద్ధమని అగ్రరాజ్యాధినేత జో బైడెన్ మరోమారు ప్రకటించారు. యుద్ధాన్ని నివారించేందుకు తగిన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, రష్యా, ఉక్రెయిన్ దేశాల సరిహద్దుల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానేవుంది. పశ్చిమ భాగంలో ఇరు దేశాల సైనికుల మొహరింపు, వేర్పాటువాదుల నుంచి ఉక్రెయిన్‌పై దాడులు, ప్రతిగా ఉక్రెయిన్ జరుపుతున్న దాడుల్లో రష్యాకు భారీగానే ఆస్తి నష్టం వాటిల్లుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయగిరి మెరిట్స్ కాలేజీలో మంత్రి గౌతం రెడ్డి అంత్యక్రియలు