Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 February 2025
webdunia

గుండెపోటు మరణాలు.. కారణం ఏంటంటే.. ఉప్పు ఎక్కువగా వాడటమే!

Advertiesment
salt
, శనివారం, 11 మార్చి 2023 (07:17 IST)
ఒకవైపు కరోనా సబ్ వేరియంట్లతో ఇబ్బందులు మరోవైపు అనారోగ్య సమస్యలు, ఇంకా గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడేవారు అధికమవుతున్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు కారణాలు చెప్తూ నివేదిక విడుదల చేసింది.  ఉప్పు అధికంగా వాడటం వల్లే గుండెపోటు వస్తున్నట్లు పేర్కొంది. 
 
ఉప్పు మోతాదు పెంచితే అనారోగ్య సమస్యలు వస్తాయని.. మితిమీరిన ఉప్పు వాడకం వల్ల గుండెపోటు మాత్రమే కాకుండా ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వస్తాయని నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నిర్దేశించిన ప్రమాణాల మేరకు రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పును మాత్రమే వాడాలి. 
 
కానీ ప్రపంచంలో అందుకు విరుద్ధంగా పది గ్రాముల ఉప్పును రోజుకు తీసుకుంటున్నారని పేర్కొంది. గుండెపోటు వంటి హఠాన్మరణాలకు అనారోగ్యపు ఆహారపు అలవాట్లే కారణమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 
 
ఇక 2025 నాటికి ప్రపంచంలో ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యం ఆచరణలో కనిపించడంలేదని డబ్ల్యూహెచ్ఓ విచారం వ్యక్తం చేసింది. ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెచ్3ఎన్2 వైరస్.. పిల్లలు, వృద్ధులు జాగ్రత్త.. మార్చి చివరి కల్లా వుండదు..