భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చైనీయులు ఓ ముద్దుపేరు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా మోడీకి మంచి ఆదరణ ఉన్న విషయం తెల్సిందే. అలాగే, చైనాలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో ప్రధాని మోడీకి చైనీయులు మోడీ లాక్షియన్ అనే పేరు పెట్టారు.
మోడీ నాయకత్వంలో భారత్, అగ్రదేశాలతో దౌత్య సంబంధాల విషయంలో సమతూకం పాటిస్తుందని చైనా జర్నలిస్టు ము షుంసాన్ అందులో పేర్కొన్నారు. చైనా నెటిజన్లు భారత ప్రధానిని మోడీ లాక్షియన్ అని పిలుచుకుంటున్నారని తెలిపారు. అంటే అసాధారణ ప్రజ్ఞ ఉన్న వృద్ధుడైన దివ్య పురుషుడు అని అర్థం. మోడీ వస్త్ర ధారణతో పాటు రూపం కూడా భిన్నంగా ఉంటాయని, ఆయన విధానాలు గత నేతల కంటే విభిన్నంగా ఉన్నాయని చెప్పారు.
అందుకే చైనా ప్రజల్లో మోడీకి ఓ అసాధారణ స్థానముందని ఆయన చెప్పారు. చైనా ప్రజలు ఓ విదేశీ నేతకు ముద్దుపేరు పెట్టడం ఎపుడూ చూడలేదని చెప్పారు. చైనా సోషల్ మీడియా వేదికైన సైనా వీబోలో మోడీ 2015లో చేరినట్టు చెప్పారు. ఆయనకు 2.44 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారని, అయితే, 2020లో చైనా యాప్‌లపై భారత్ విధించిన నిషేధం కారణంగా ప్రధాని మోడీ ఖాతాను మూసివేశారని చైనా జర్నలిస్టులు చెప్పుకొచ్చారు.