Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త జైల్లో ఉంటే.. నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన భార్య.. ఎలా?

Advertiesment
భర్త జైల్లో ఉంటే.. నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన భార్య.. ఎలా?
, ఆదివారం, 23 జనవరి 2022 (09:32 IST)
భర్త జైల్లో ఉంటే భార్య మాత్రం ఏకంగా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ ఘటన పాలస్తీనాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రఫత్ అల్ ఖరావీ అనే వ్యక్తి కరుడు గట్టిన ఉగ్రవాది. గత 2006లో ఇజ్రాయెల్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న ఖరావీ గత యేడాది మార్చి నెలలో విడుదలయ్యాడు. 
 
ఇటీవల ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. తాను జైల్లో ఉన్న సమయంలో తన భార్య నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిందని వెల్లడించాడు. నా వీర్యాన్ని పలు మార్గాల ద్వారా భార్యకు చేరవేసేవాడ్ని. ఆ వీర్యాన్ని రజాన్ మెడికల్ సెంటర్‌కు అందజేసేవారు. అక్కడ వైద్య నిపుణులు కృత్రిమ పద్ధతిలో నా భార్యకు గర్భంలో ప్రవేశపెట్టారు. 
 
ఆ విధంగా నేను నలుగురు బిడ్డలకు తండ్రినయ్యాను. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలు నుంచి వీర్యం తరలించడం కోసం క్యాంటీన్‌ను ఎంచుకుంటున్నాను అని చెప్పారు. క్యాంటీన్‌ పనులకు కోసం బయట నుంచి వచ్చే వారిపై తనిఖీలు తక్కువగా ఉండేవి. దాంతో వీర్యాన్ని చిప్స్ ప్యాకెట్ల్, బిస్కెట్ బ్యాకెట్ల కవర్లలో ఉంచి వారి ద్వారా జైలు నుంచి వెలుపలికి పంపేవాడిని. జైలు బయట నా భార్య, తల్లి ఉండేవారు, వారు ఆ వీర్యాన్ని రజాన్ మెడికల్ సెంటర్‌కు చేరవేసేవారు అని ఖరానీ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

1000 నగరాల్లో రిలయన్స్ జియో 5జీ సేవలు