Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనర్ బాలికను పెళ్ళి చేసుకున్న పాకిస్థాన్ ఎంపీ!!

మైనర్ బాలికను పెళ్ళి చేసుకున్న పాకిస్థాన్ ఎంపీ!!
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:40 IST)
సాధారణంగా ఒక దేశానికి ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులు ఆ దేశ పౌరులకు ఆదర్శంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, పాకిస్థాన్ ప్రజాప్రతినిధులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ప్రపంచంలో బాల్య వివాహాలు చట్ట విరుద్ధం అని తెలిసినా.. ఆ పాక్ ప్రజాప్రతినిధులు మాత్రం అలాంటి వివాహాలకే ఎక్కువగా మొగ్గుచూపుతారు. తాజాగా ఓ పాక్ ఎంపీ ఏకంగా 14 యేళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్ దేశంలోని బలోచిస్థాన్‌లో జరుగగా, తాజాగా సంచలనం రేపింది. దీనిపై ఆ దేశ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బలోచిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడైన జమియత్ ఉలేమా ఎ ఇస్లాం నాయకుడు మౌలానా సలాహుద్దీన్ అయూబీ 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఎంపీ వివాహం చేసుకున్న బాలిక జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని అని, బాలిక 2006 అక్టోబరు 28వ తేదీన జన్మించిందని స్థానిక మహిళా సంక్షేమ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ పోలీసులు బాలిక పెళ్లి ఉదంతంపై దర్యాప్తు చేశారు. బాలిక తల్లిదండ్రులను పోలీసు ఎస్ఐ కలవగా, తాము పెళ్లి చేయలేదని అఫిడవిట్ సమర్పించారు. పాకిస్థాన్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే తల్లిదండ్రులను శిక్షిస్తారు. 
 
కాగా పాక్ ఎంపీ బాలికను పెళ్లాడాడని పరిశీలనలో తేలింది. తమ కూతురికి 16 ఏళ్ల వయసు నిండే వరకు తాము అత్తింటికి పంపించమని బాలిక తండ్రి హామి ఇచ్చాడని పాక్ అధికారులంటున్నారు. మొత్తంమీద సాక్షాత్తూ ఎంపీనే చట్టానికి విరుద్ధంగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఘటన పాకిస్థాన్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై సూపర్ కింగ్స్‌లో సీమ కుర్రాడు: ‘ధోనీతో ఒక్క ఫొటో దిగితే చాలనుకున్నా, ఇప్పుడు కలిసి ఆడబోతున్నా’’