Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబ్బాబు.. మీకు దణ్ణం పెడతాం.. భారత్ దాడి నుంచి రక్షించండి.. గల్ఫ్ దేశాలకు పాక్ వినతి!!

Advertiesment
India vs Pakistan

ఠాగూర్

, శనివారం, 3 మే 2025 (09:03 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనివుంది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయంతో పాటు నిధులు సమకూర్చి పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ కన్నెర్రజేసింది. పైగా, పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు సైతం ముక్తకంఠంతో ఖండించాయి. అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. 
 
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ఈ దాడికి నైతిక బాధ్యత వహించింది. దీంతో భారత్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనపై పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. భారత్ ఏ క్షణంలో దాడి చేస్తుందోనన్న భయంతో నిద్రలేని రాత్రులను గడుపుతోది. వైకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం భారత్ చర్యలపై భయంతో రక్షణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
 
ఈ క్రమంలోనే పలు ప్రపంచ దేశాల సాయం కోరుతోంది. ఇప్పటికే చైనా, రష్యా దేశాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వెల్లడించారు. పైగా, రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని ఆయన ప్రాధేయపడ్డారు. ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకుని ఉద్రిక్తలు తగ్గించేందుకు చొరవు తీసుకోవాలని కోరారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా అరబ్ దేశాల సాయం కోరారు. ఈ ప్రాంతలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్‌పై ఒత్తిడి తీసుకుని రావాలని అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలను పాకిస్థాన్ ప్రధాని కోరారు. పాకిస్థాన్‌లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయిద్ అల్ మాలికీతో సమావేశంలో దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్థాన్ కృషి చేస్తుందని పాక్ ప్రధాని పునరుద్ఘాటించారని పీఎంఓ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ లైరాయిదేవి ఆలయ జాతరలో తొక్కిసలాట : ఏడుగురి దుర్మరణం