స్మార్ట్ ఫోన్లపై నేటి యువతకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే పిజ్జాలు, బర్గర్లు అంటే తెగ ఇష్టపడుతున్నారు. తమకు కావలసిన వస్తువులు, ఆహార పదార్థాల కోసం యువత దేనికైనా సిద్ధపడుతున్నారు. వద్దంటే తల్లిదండ్రులతో గొడవపడుతున్నారు. కానీ ఇక్కడొకడు పిజ్జా ఆర్డర్ చేసుకుంటానంటే తల్లి వద్దని చెప్పిందని.. ఆమెను హతమార్చాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన నళిని (51) భర్త, కుమారుడితో కలిసి అమెరికాలోని నార్త్ కరోలోనాలో స్థిరపడ్డారు. నళిని కుమారుడు ఆర్నవ్.. చెడు అలవాట్లకు బానిసగా మారాడు. దీన్ని గమనించిన నళిని అతని కట్టడి చేసేందుకు సిద్ధమైంది. దీన్ని తెలుసుకున్న ఆర్నవ్ తల్లిని శత్రువుగా చూడటం మొదలెట్టాడు. ఆమెపై పగను పెంచుకున్నాడు.
ఓసారి పిజ్జా వద్దని చెప్పినా ఆర్డర్ చేశాడని ఆర్నవ్‌ను నళిని కోపంతో చెంపపై కొట్టింది. దీంతో ఆవేశానికి గురైన ఆర్నవ్ ఆమెను గొంతు నులిమి హతమార్చాడు. ఆస్పత్రికి ఆర్నవ్ తీసుకెళ్లలేకపోవడంతో నళిని ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై మైనర్ కావడంతో ఇన్నాళ్లు కేసు నమోదు చేయని పోలీసులు.. గత ఏడాది అభియోగాలు నమోదు చేశారు. ఇంకా ఆర్నవ్ తల్లిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.