Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ మాజీ దౌత్యవేత్త కుమార్తెపై అత్యాచారం.. ఆపై గొంతుకోసి నిప్పంటించారు.... ఎక్కడ?

Advertiesment
Noor Mukaddam
, సోమవారం, 26 జులై 2021 (11:29 IST)
పాకిస్థాన్ దేశంలో ఓ దారుణం జరిగింది. ఆ దేశ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్‌ను ఆమె స్నేహితులే క్రూరంగా హింసించి చంపేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున్న దుమారం రేపుతోంది. #Justicefornoor హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌ మాజీ దౌత్యవేత్త షౌకత్‌ ముకదమ్‌కు నూర్‌ (27) అనే కుమార్తె వుంది. మంగళవారం రాత్రి ఇస్లామ్‌బాద్‌ సెక్టార్‌ ఎఫ్‌-7/4లోని ఓ ఇంట్లో ఘోర హత్యకు గురైంది. ఆ ఇల్లు ఆమె స్నేహితుడైన పాక్ కోటీశ్వరుడి కుమారుడు జహీర్‌ జకీర్‌ జాఫర్‌ది. 
 
అయితే ఈ హత్య జహీర్‌ చేసిందనేనని నిర్ధారించిన పోలీసులు.. శనివారం దాకా అతన్ని అరెస్ట్ చేయలేదు. అంతేకాదు అతని మానసిక స్థితి సరిగాలేదని, అతన్ని చికిత్స కోసం తరలించాలని ఇస్లామాబాద్‌ పోలీసులు కోర్టును ఆశ్రయించడంపై జనాల్లో ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. వేల సంఖ్యలో బ్యానర్లు చేతబడ్డి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, షౌకత్ మంగళవారం ఉదయం బక్రీద్‌ కోసమని గొర్రెను కొనడానికి రావల్పిండికి వెళ్లాడు. ఆయన భార్య కొత్త బట్ల కోసం బయటకు వెళ్లింది. వచ్చి చూసేసరికి కూతురు ఇంట్లో లేదు. తన స్నేహితులతో బయటకు వెళ్తున్నానని, ఒకటి రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. 
 
కానీ, మంగళవారం మధ్యాహ్నం నూర్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రాగా.. ఆమె తన దగ్గర లేదని జకీర్‌ బదులిచ్చాడు. అదేరోజు రాత్రి ఆమె మృతదేహం దొరికినట్లు ఖోహ్‌సర్‌ పోలీసులు షౌకత్‌కు సమాచారం అందించారు. అయితే, నూర్‌ పోస్ట్‌‌మార్టం రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. 
 
బతికుండగానే ఆమెను చిత్రవధ చేశారు. ఆమె ఒంటిపై అన్ని చోట్లా కత్తి గాట్లు పెట్టారు. సూదులతో వీపులో గుచ్చారు. జుట్టు కత్తించేశారు. ఆపై ఆమె శరీరాన్ని తగలబెట్టి.. పదునైన ఆయుధంతో పీక కోశారు. తల, మొండాన్ని వేరు చేసి.. దూరంగా పడేశారు. 
 
ఈ పైశాచిక ఘటన ఒక్కసారిగా పాక్‌ ఉలిక్కిపడింది. అయితే అత్యాచారానికి గురైందన్న బాధితురాలి తండ్రి షౌకత్‌ అనుమానాలపై డాక్టర్ల నుంచి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. 
 
మరోవైపు ఈ ఘటన యావత్‌ దేశాన్ని దిగ్‌భ్రాంతికి గురి చేసింది.  బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో జకీర్‌ను శనివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి టెక్కీకి ప్రధాని మోడీ ప్రశంస... ఎందుకో తెలుసా?