ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ పురస్కారాన్ని ఈ యేడాది నోబెల్ కమిటీ ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించింది. రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ 2025 సంవత్సరానికిగాను ముగ్గురికి దీనిని అందించనుంది. 'ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధి'ని వెల్లడించినందుకు జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
మోకిర్ అమెరికన్ - ఇజ్రాయెలీ ఆర్థికవేత్త కాగా, హోవిట్ కెనడా, అఘియన్ ఫ్రాన్స్‌కు చెందిన ఆర్థిక నిపుణులు. సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు మోకిర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 'క్రియేటివ్ డిస్ట్రక్షన్' ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతానికిగానూ మిగతా ఇద్దరికి నోబెల్ ప్రకటించారు. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది.
కాగా, ఇటీవల నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనెజువెలా ప్రతిపక్ష నేతలా మరియా కొరియాకు నోబెల్ కమిటీ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆయనకు నోబెల్ కమిటీ నిరాశ మిగిల్చింది.