Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫేస్‌బుల్ లైవ్‌లో మాట్లాడుతుండగా.. జర్నలిస్టును హతమార్చారు.. ఎక్కడ?

టీవీ లైవ్‌లో మాట్లాడుతుండగా జర్నలిస్ట్ హత్యకు గురైన ఘటన సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాలో చోటుచేసుకుంది. సామాజిక భద్రతా పథకాల సంస్కరణలపై నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్ అర్టేగా ఆ దేశ చట్టసభలో గత బుధవార

ఫేస్‌బుల్ లైవ్‌లో మాట్లాడుతుండగా.. జర్నలిస్టును హతమార్చారు.. ఎక్కడ?
, సోమవారం, 23 ఏప్రియల్ 2018 (10:36 IST)
టీవీ లైవ్‌లో మాట్లాడుతుండగా జర్నలిస్ట్ హత్యకు గురైన ఘటన సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాలో చోటుచేసుకుంది. సామాజిక భద్రతా పథకాల సంస్కరణలపై నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్ అర్టేగా ఆ దేశ చట్టసభలో గత బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు తీవ్ర ఆందోళనలకు కారణమైంది. దీంతో అప్పటి నుంచి  నికరాగ్వా తీవ్ర నిరసనలతో అట్టుడుకుతోంది. 
 
నిరసనకారులు ధ్వంసం చేసిన ఏటీఎం సెంటర్ గురించిన ప్రసారాలను లైవ్ ద్వారా వివరిస్తున్న స్థానిక టీవీ ఛానల్ జర్నలిస్ట్ ఏంజెల్ గహోనాను గుర్తు తెలియని ఆగంతకులు కాల్చి చంపారు. దీంతో.. ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 25 మంది మృతి చెందినట్లు మానవహక్కుల సంఘాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీం చీఫ్ జస్టీస్‌పై అభిశంసన : తిరస్కరించిన ఉపరాష్ట్రపతి