Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్వాస ద్వారా కొవిడ్‌ టీకా - అమెరికన్ శాస్త్రవేత్తల కృషి

covid vaccine
, గురువారం, 7 జులై 2022 (12:25 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తుంది. ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టారు. అయితే, ఇపుడు ముక్కు ద్వారా పీల్చే రూపంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అమెరికన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వైద్య సిబ్బంది సాయం లేకుండా ఎవరికివారు సొంతంగా తీసుకోవచ్చు. 
 
పైగా, ఈ టీకా నిల్వకు శీతల సదుపాయం కూడా అక్కర్లేదు. సాధారణ ఉష్ణోగ్రతలోనే మూడు నెలల వరకు భద్రపరచవచ్చని వారు తెలిపారు. మనుషులు కరోనా వైరస్‌ కొమ్ములోని సూక్ష్మభాగాన్ని శ్వాస ద్వారా టీకా రూపంలో తీసుకున్నప్పుడు మన రక్షణ వ్యవస్థ వెంటనే యాంటీబాడీలను తయారు చేస్తుందని పరిశోధకులు వివరించారు. ఈ టీకా ఆవిష్కరణకు సంబంధించిన అధ్యయనం నేచర్‌ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ పత్రికలో ప్రచురితమైంది. 
 
ప్రస్తుతం ఇంజక్షన్‌ ద్వారా ఇస్తున్న కొవిడ్‌ టీకా శ్వాసకోశంలోకి అంత సమర్థంగా చేరలేకపోతోంది. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను అతిశీతల వాతావరణంలో భద్రపరచాలి. వాటిని సుశిక్షిత వైద్య సిబ్బంది మాత్రమే ఇవ్వగలరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

346 చిన్నారులను చంపేసిన రష్యా సైనికులు