Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనా అధినేతతో కలిసి నరేంద్ర మోడీ పడవ షికారు.. ఎక్కడ?

ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు చైనా పర్యటనకు వెళ్లారు. ఆయన శుక్ర, శనివారాల్లో వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం చైనాలోని వూహాన్‌లో ఉన్న నరేంద్ర మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కల

Advertiesment
Narendra Modi
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (12:43 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు చైనా పర్యటనకు వెళ్లారు. ఆయన శుక్ర, శనివారాల్లో వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం చైనాలోని వూహాన్‌లో ఉన్న నరేంద్ర మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కలిసి ముఖాముఖి చర్చలు జరుపుతారు. అలాగే, భారత్, చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక, అంతర్జాతీ అంశాలతో పాటు.. అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఉత్పన్నమవుతున్న ఉద్రిక్తతలపై కూడా చర్చకు రానున్నాయి.
 
ముఖ్యంగా, భారతదేశం - చైనా మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా కొనసాగుతున్న సమస్యలపై వీరిద్దరూ మనసారా మాట్లాడుకుంటారని అధికార వర్గాలు చెప్పాయి. అలాగే, డోక్లాంలో చైనా - భారత్ మధ్య 73 రోజులపాటు ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ అనధికార భేటీకి చాలా ప్రాధాన్యం ఉంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మ, దీర్ఘకాలిక ప్రాతిపదికపై చర్చలు జరుగుతాయి. 
 
మరోవైపు చాలా ఆనందకరమైన వాతావరణంలో వీరిద్దరి సంభాషణలు జరుగుతాయి. పడవలో షికారు చేస్తూ, ఈస్ట్ లేక్ సరస్సు తీరంలో వాహ్యాళి చేస్తూ మాట్లాడుకుంటారు. చైనాలోని సుప్రసిద్ధ మ్యూజియంను కూడా ప్రధాని మోడీ సందర్శిస్తారు. సుందర సరస్సు తీరంలో విందు సమావేశం జరుగుతుంది. ఈ సమయంలో వీరిద్దరితోపాటు ఇతర అధికారులు ఉండరు, కేవలం దుబాసీలు మాత్రమే ఉంటారు. వీరు ఒకరి మాటలను మరొకరికి అనువాదం చేసి వినిపిస్తారు. మొత్తంమీద నరేంద్ర మోడీ ఈ చైనా పర్యటన సరికొత్త శకానికి నాందిపలుకనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా అక్క అఖిలను టచ్ చేయాలంటే.. భూమా ఫ్యామిలీని దాటి వెళ్లాలి... నాగ మౌనిక