Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లీజ్.. ప్లీజ్.. మా దేశంలోని పర్యాటక అందాలను తిలకించండి... మాల్దీవుల వేడుకోలు

Advertiesment
Maldives

ఠాగూర్

, మంగళవారం, 7 మే 2024 (11:30 IST)
భారతీయ పర్యాటకులు బాయ్‌కట్ చేయడంతో మాల్దీవుల పర్యాక రంగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మాల్దీవులలకు చెందిన ముగ్గురు మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. భారత్‌తో పాటు ప్రధాని మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా భారతీయ పర్యాటకులు మాల్దీవులకు వెళ్లడం మానేశారు. దీంతో ఆ దేశ పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. ఇది ఆ దేశ ఆర్థిక రంగాన్ని బాగా దెబ్బతీసింది. 
 
మాల్దీవులకు అక్కడికి వెళ్లే భారతీయ సందర్శకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో అక్కడి పర్యాటక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. అయితే తిరిగి భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి పర్యాటక కంపెనీలు ఇదివరకే పలు ప్రయత్నాలు చేయగా.. తాజాగా ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహిం ఫైసల్ రంగంలోకి దిగారు. పర్యాటక రంగంపైనే ఎక్కువగా ఆధారపడే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని భారతీయ పర్యాటకులను ఇబ్రహిం ఫైసల్ అభ్యర్థించారు. 
 
తమ దేశ ప్రజలు, ప్రభుత్వం భారతీయుల రాకపోకలకు ఘన స్వాగతం పలుకుతాయని ఇబ్రహిం ఫైసల్ అన్నారు. టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడే తమ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు తోడ్పాటు అందించాలని మాల్దీవుల మంత్రిగా తాను కోరుతున్నానని అన్నారు. దయచేసి సహకరించాని అభ్యర్థించారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
'మాల్దీవులు, భారత్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని, కొత్తగా ఎన్నికైన తమ ప్రభుత్వం కూడా భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటోందని అన్నారు. తాము భారత్‌తో ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నామని అన్నారు. కాగా ఈ యేడాది జనవరి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ తీరంలోని లక్షద్వీప్ దీవులు సందర్శించి అక్కడి ఫొటోలు, వీడియోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి.. లైట్లు ఆఫ్ చేసిన తర్వాత?