రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటుచేసుకుంటోంది. యుద్ధం మొదలైన ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపు 13వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. వీరిలో సాధారణ పౌరులో అధికమని చెప్పారు.
రష్యా సైనికుల లక్ష మంది వరకు మరణించినట్లు అంచనా వేశామన్నారు. ఉక్రెయిన్ వైపు చనిపోయిన, గాయపడిన వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లయెన్ తెలిపారు. ఉక్రెయిన్ పౌరులు 40వేల మంది వరకు ప్రాణాలు మృతి చెందారు.