Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ తోక చుక్క 1986లో కనిపించిందట..

ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ తోక చుక్క 1986లో కనిపించిందట..
, గురువారం, 6 మే 2021 (11:41 IST)
Halley
ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఈ వారం ఈ అద్భుతం జరుగనుంది. మిలమిల మెరిసే హాలే తోకచుక్క నుంచి అవశేషాలు రాలిపడనున్నాయి. హాలే తోకచుక్క అవశేషాలు మంగళవారం నుంచి గురువారం వరకు మనకంటికి కనిపించనున్నాయి. 
 
ఈ తోక చుక్క చివరిసారిగా 1986లో కనిపించింది. మళ్లీ 2061 వరకు మరోసారి కనిపించదు. కానీ, ఈ తోక చుక్క అవశేషాలు ఇప్పటికీ మన భూ వాతావరణంలో తిరుగుతున్నాయి.
 
ప్రతి ఏడాదిలో రెండుసార్లు ఈ తోకచుక్క అవశేషాలు కనిపిస్తాయి. ఈ వారమంతా, భూమి సౌర వ్యవస్థ హాలీ తోక చుక్క నుంచి రాలిపోయిన దుమ్ముతో నిండిపోతుంది. 
 
ఈ ఏడాదిలో ఎటా అక్వేరిడ్స్ బుధవారం రాత్రి గురువారం ఉదయం వరకు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ అవశేషాలు మే 28 వరకు తిరుగుతూ కనిపిస్తాయి. ఈ ఏడాదిలో గంటకు 10 నుండి 20 ఉల్కలు ఆకాశమంతా విస్తరించాయి.
 
చంద్రుడు అస్తమించిన తర్వాత రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ తోకచుక్క అవశేషాలను చూడొచ్చు. తక్కువ ప్రకాశవంతమైన ప్రాంతంలో నిలబడి ఆకాశంలో అద్భుతాన్ని చూడొచ్చు. 
 
అనేక వందల ఏళ్ల క్రితం తోకచుక్క నుంచి వేరైన ఉల్కలు వలె ఈ హాలే తోకచుక్క కణాలు ప్రస్తుత కక్ష్యలో తిరుగుతున్నాయి. ఏదిఏమైనా తోకచుక్క భూమి కక్ష్యను దాటదు. భూవాతావరణంలోని రాగానే అదృశ్యమైపోతుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగాల్‌ హింసపై కేంద్రం సీరియస్.. విచారణకు ప్రత్యేక కమిటీ