కరోనా పుట్టినిల్లు చైనా ప్రస్తుతం కరోనా కట్టడికి మందును కనిపెట్టే పనిలో పడింది. తాజాగా కరోనాను నియంత్రించేందుకు Favipiravir అనే మందు సహకరిస్తున్నట్లు చైనా ప్రకటించింది. చైనా నుంచి ఇతర దేశాలకు పాకిన కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిది వేలను తాకింది. ఇంకా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,18,000కి చేరింది.
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు చైనా ఓ ప్రకటన చేసింది. జపాన్ నుంచి దిగుమతి అయిన Favipiravir అనే మందు కరోనాను కట్టడి చేస్తున్నట్లు తెలిపింది. ఈ మందుతో 340 మంది కరోనా నుంచి తప్పించుకున్నారని చైనా వెల్లడించింది. ఇంకా కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తుల ఇబ్బందులను దూరం చేసేందుకు ఈ మందు ఉపయోగపడుతున్నట్లు చైనా ప్రకటించింది.