Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్కడ పెళ్లి చేసుకుంటే రూ.4 లక్షల బహుమతి!!

అక్కడ పెళ్లి చేసుకుంటే రూ.4 లక్షల బహుమతి!!
, సోమవారం, 26 అక్టోబరు 2020 (10:04 IST)
సాధారణంగా ప్రతి యువకుడు అమ్మాయి అందుబాటులో ఉంటే వీలైనంత తొందరగా పెళ్లి చేసుకునేందుకు అమితాసక్తి చూపుతారు. అయితే, మన దేశంతో పాటు పలు దేశాల్లో వివాహాలు చేసుకునేందుకు అమ్మాయిలు కనిపించడం లేదు. దీంతో అబ్బాయిలు ముదురు బ్యాచిలర్స్‌గానే ఉంటున్నారు. 
 
ఇది జపాన్ దేశంలో పెద్ద సమస్యగా మారింది. అబ్బాయిలు - అమ్మాయిలు పెళ్ళిళ్లు చేసుకోకపోవడంతో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతోంది. ఇది జపాన్ ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఆ దేశ ప్రభుత్వం సరికొత్త ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. 
 
యువతీ యువకులను పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించడం ద్వారా పడిపోతున్న జననాల రేటును తిరిగి గాడిన పెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ఆరు లక్షల యెన్‌లు (భారత కరెన్సీలో రూ.4 లక్షలకు పైగా) ప్రోత్సాహక బహుమతి కింద ఇవ్వనుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ సొమ్ము ఎంతగానో పనికివస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
 
అయితే, పథకాన్ని ప్రకటిస్తూనే కొన్ని నిబంధనలు కూడా విధించింది. యువతీ యువకులు తొలుత తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. వయసు 40 ఏళ్లకు మించకుండా, వార్షికాదాయం 5.4 లక్షల కంటే తక్కువగా ఉన్న వారే ఈ పథకానికి అర్హులని తెలిపింది. కాగా, జపాన్‌లో గతేడాది 8.65 లక్షల మంది మాత్రమే జన్మించారు. మరి పథకాన్ని యువతీయువకులు సద్వినియోగం చేసుకుని దేశ జనాభాను ఏమాత్రం పెంచుతారో వేచి చూడాల్సిందే! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా.. వదిన చేతి అప్పడాలు తింటూ, గోమూత్రం తాగితే...