Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సౌదీ అరేబియాతో భారత్ 12 ఒప్పందాలు

సౌదీ అరేబియాతో భారత్ 12 ఒప్పందాలు
, బుధవారం, 30 అక్టోబరు 2019 (18:49 IST)
రెండురోజుల సౌదీఅరేబియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ..ఆ దేశ రాజు సల్మాన్ బిన్‌ అబ్దులజీజ్‌తో పాటు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తోనూ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటనలో దాదాపు 12 అంశాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.

ఇరు దేశాల పరస్పర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమైన అంశాలపై చర్చించి త్వరితగతిన నిర్ణయం తీసుకునేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటుచేశారు. ఈ మండలికి మోదీ, యువరాజు సల్మాన్‌ అధ్యక్షులుగా ఉంటారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి సమావేశమై చర్చలు జరుపుతారు. ఉగ్రవాదంపై పోరు ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రంగా ఖండించారు మోదీ, సల్మాన్‌.

ఉగ్రభూతం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ప్రకటించారు. జాతి, మతం, సంస్కృతితో సంబంధం లేకుండా తీవ్రవాదంపై పోరుకు సహకరిస్తామని..పాకిస్థాన్‌కు సహజ భాగస్వామి అయిన సౌదీఅరేబియా భారత్‌కు హామీ ఇచ్చింది.
 
సౌదీలో విజయవంతంగా ముగిసిన మోదీ పర్యటన
సౌదీ అరేబియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. సౌదీ రాజు, యువరాజుతో భేటీ, భవిష్యత్తు పెట్టుబడుల సదస్సులో కీలక ప్రసంగం తర్వాత దిల్లీకి వచ్చారు మోదీ.

రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్తో పాటు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తోనూ భేటీ అయ్యారు. భారత్- సౌదీఅరేబియా మధ్య పరస్పర సహకారం కోసం వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మరో 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

పెట్టుబడుల సదస్సులో.. రియాద్లో జరిగిన భవిష్యత్తు పెట్టుబడుల సదస్సులోనూ మోదీ ప్రసంగించారు. భారత్లోని అంకురసంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచాన్ని కోరారు. వచ్చే ఐదేళ్లలో చమురు, గ్యాస్ రంగంలో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.

సౌదీలోనూ రూపే కార్డులు వినియోగించేలా ఒప్పందం కుదిరింది. దీనిద్వారా అక్కడున్న 26 లక్షల మందితోపాటు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లేవారికి ఉపకరిస్తుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ