Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్‌కు అమెరికా వార్నింగ్ : మీరు చేస్తారా? మేం చేయాలా?

ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌కు అమెరికా గట్టివార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదుల ఏరివేత విషయంలో ఇకేమాత్రం అలక్ష్యాన్ని ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. పైగా, ఉగ్రవాదుల ఏరివేతను మీరు చేస్తారా? మేం

పాక్‌కు అమెరికా వార్నింగ్ : మీరు చేస్తారా? మేం చేయాలా?
, శనివారం, 28 అక్టోబరు 2017 (07:59 IST)
ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌కు అమెరికా గట్టివార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదుల ఏరివేత విషయంలో ఇకేమాత్రం అలక్ష్యాన్ని ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. పైగా, ఉగ్రవాదుల ఏరివేతను మీరు చేస్తారా? మేం చేయాలా? అంటూ అమెరికా విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్‌సన్ సూటిగా ప్రశ్నించారు. 
 
ఆయన ఇటీవల ఇస్లామాబాద్ పర్యటనకు వెళ్లిన విషయం తెల్సిందే. పాక్‌తో జరిగిన అంశాలపై ఆయన జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ, పాకిస్థాన్‌ పాలకులకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపారు. ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఊరుకోబోనని హెచ్చరించామన్నారు. ఉగ్రవాద ముఠాలపై పాక్ నిర్ణయాత్మక చర్యలు చేపట్టకపోతే ఆ లక్ష్యాన్ని సాధించేందుకు తన వ్యూహాలను, ఎత్తుగడలను సర్దుబాటు చేసుకుని విభిన్నమార్గంలో ముందుకు సాగుతామని చెప్పినట్టు తెలిపారు. 
 
ఆ పని మీరు చేయాలనుకోకపోతే, చేయలేమని భావిస్తే.. మేం మా వ్యూహాలను ఎత్తుగడలను సవరించుకుని ఆ లక్ష్యాన్ని సాధిస్తాం. ఒక సార్వభౌమ దేశంగా మిమ్మల్ని డిమాండ్ చేయలేం.. కానీ మేం ఆశిస్తున్నది ఇదీ అని మాత్రం పాక్ నేతలకు నొక్కిచెప్పాం అని టిల్లర్‌సన్ వివరించారు. నేను పాక్ నేతలను కలుసుకోవడం ఇదే మొదటిసారి కనుక చాలావరకు సమయం వినడానికే కేటాయించాను. 80 శాతం విన్నాను. 20 శాతం మాట్లాడాను అని ఆయన అన్నారు. 
 
రోహింగ్యాల సమస్యపై రెక్స్ టిల్లర్‌సన్ మయన్మార్ సైనిక దళాధిపతి సీనియర్ జనరల్ మనాంగ్ హలేంగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉత్తర మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రంలో హింసాకాండను అంతమొందించడంలో ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని ఆయన బర్మా సైనిక నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.
 
అలాగే, ఉత్తరకొరియా సమస్యపై తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని అమెరికా రక్షణమంత్రి జేమ్స్ మాటిస్ స్పష్టం చేశారు. దౌత్యపరమైన పరిష్కారం కోసమే తాము కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేమూ మనుషులమే... మహిళా రోబోకు పౌరసత్వం...