Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నైజీరియాలో మారణహోమం - 12 మందిని కాల్చిచంపిన దుండగులు

gunmen fire
, సోమవారం, 5 డిశెంబరు 2022 (10:06 IST)
నైజీరియా దేశంలో మరో మారణహోమం జరిగింది. ఒక మసీదులో చొరబడిన సాయుధ దుండగులు మసీదు ఇమామ్‌తో సహా 12 మందిని తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ తర్వాత మరికొందరిని బందీలుగా తమ వెంట తీసుకెళ్లారు. 
 
గత కొంతకాలంగా నైజీరియాలో బందిపోట్లుగా పిలిచే సాయుధ ముఠాలు ప్రజలపై దాడి చేసి హత్య చేయడమో లేక కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడమో పరిపాటిగా మారిపోయింది. అలాగే, రైతులు పంటలు పండించుకోవాలన్నా ఈ ముఠాలకు ప్రొటెక్షన్ ఫీ పేరుతో కప్పం చెల్లించుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా సాయుధ దండగులు మరోమారు పెట్రేగిపోయారు. ఏకంగా 12 మందిని కాల్చిచంపి మారణహోమానికి పాల్పడ్డారు. ఈ దారుణం నైజీరియా అధ్యక్షుడు ముహమ్ముదు బుహారీ సొంత రాష్ట్రమైన కట్సినాలో జరిగింది. మైగమ్‌జీ మసీదు వద్ద మోటారు సైకిళ్లపై వచ్చిన దండగులు ఒక్కసారిగా లోపల ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. 
 
దీంతో మసీదులో ఉన్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ క్రమంలో మసీదు ఇమామ్‌తో సహా 12 మందిని కాల్చిచంపేశారు. ఆ తర్వాత మరికొందరిని కిడ్నాప్ చేశారు. బందిపోట్ల ముఠా శిబిరాలపై నైజీరియా సైన్యం దాడులు చేస్తున్నప్పటికీ ఇలాంటి మారణహోమాలు మాత్రం ఆగడంలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ముఖ్యమంత్రి జయలలిత వర్థంతి తేదీపై సరికొత్త వివాదం!