Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ వంట మనిషిని ఉరితీసిన కువైట్!!

Advertiesment
hang

ఠాగూర్

, శనివారం, 3 మే 2025 (09:38 IST)
ఇంటి యజమాని హత్య కేసులో దోషిగా తేలిన భారతీయ వంటమనిషికి కువైట్‌లో మరణశిక్ష విధించారు. గుజరాత్ రాష్ట్రంలోని కపడ్‌వంజ్‌కు చెందిన 38 యేళ్ల ముస్తకీం భాతియారాకు ఏప్రిల్ 28వ ఈ శిక్షను అమలు చేశారు. అనంతరం అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించి, బుధవారం స్వస్థంలో ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. 
 
తాజా సమాచారం మేరకు... ముస్తకీ సుమారు ఏడేళ్లుగా కువైట్‌లో రెహానా ఖాన్ అనే మహిళ ఇంట్లో మనిషిగా పనిచేస్తున్నాడు. 2019లో యజమాని రెహానా ఖానాతో ముస్తకీంకు వివాదం తలెత్తింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీయడంతో ముస్తకీం ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత యజమాని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కువైట్ పోలీసులు ముస్తకీంను అరెస్టు చేశారు. విచారణ అనంతరం 2021లో న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. 
 
గుజరాత్‌‍లోని కపడ్‌వంజ్‌లోని మొహహ్మదాలీ చౌక్ నివాసం అయిన ముస్తకీం గత దశాబ్ద కాలానికి పైగా గల్ఫ్ దేశాల్లో వంట మనిషి పని చేస్తున్నాడు. మొదట దుబాయ్‌‍లో, తర్వాత బహ్రెయిన్‌లో పనిచేసిన అతను గత ఏడేళ్లుగా కువై‌ట్‌లో ఉంటున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్వారాకు చెందిన ఓ జంట అతనికి కువైట్‌లో రెహానా ఖాన్, ముస్తుఫా ఖాన్ ఇంట్లో ఉద్యోగం ఇప్పించినట్టు సమాచారం. 
 
ఈ క్రమంలో యేడాది ఏప్రిల్ 28వ తేదీన ముస్తకీంకు కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయ అధికారులు కపడ్‌వంజ్‌లోని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని అహ్మదాబాద్‌కు తలించారు. అక్కడ నుంచి స్వస్థలమైన కపడ్‌వంజ్‌కు తీసుకెళ్లి బుధవారం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వధువే అసలైన కానుక... రూ.లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించిన వరుడు!!