ఫిలిప్పీన్స్‌లో దారుణం జరిగింది. ఓ దండగుడు ఓ రాష్ట్ర గవర్నర్‌తో సహా ఎనిమిది మందిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన శనివారం జరిగింది. మృతుల్లో సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ గవర్నర్ రోయెల్ డగామో సహా మరో ఎనిమిది మంది ఉన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించి ఆదివారం మట్టుబెట్టారు. ఈ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో కనీసం ఆరుగురు దుండగులు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, అస్టాల్ రైఫిళ్లు చేతబట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని తన ఇంటిలో ప్రావిన్షియల్ లీడర్ గ్రామస్థులతో సమావేశమైనపుడు ఉన్నట్టుండి అక్కడకు వచ్చిన ముష్కరులు తుపాకీలతో రెచ్చిపోయారు. ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తీవ్రంగా ఖండించారు.