Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం.. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్పవరం..

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం.. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్పవరం..
, గురువారం, 30 జులై 2020 (10:21 IST)
Krishna
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం నేడు. స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిది. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను పంచే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్పవరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా… స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. 
  
ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. 
 
తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. ప్రతీరోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించుకుంటారు. దటీజ్ ఫ్రెండ్‌షిప్ డే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతును లారీతో తొక్కి చంపిన ఇసుక మాఫియా... ఎక్కడ?