Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌స్టాలో భర్తకు విడాకులు.. ప్రియుడుతో కలిసి దుబాయ్ యువరాణి ర్యాంప్ వాక్

Advertiesment
dubai princes

ఠాగూర్

, శుక్రవారం, 29 ఆగస్టు 2025 (11:53 IST)
దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె, దుబాయ్ యువరాణి షేఖా మహ్రా (31) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ అమెరికన్ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానా (40)తో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని మోంటానా ప్రతినిధి ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. వీరిద్దరి ప్రేమకథ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
 
గత జూన్ నెలలో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఈ జంట తమ బంధాన్ని అధికారికం చేసుకున్నట్లు సమాచారం. 2024 ఆఖరులో షేఖా మహ్రా స్వయంగా దుబాయ్‌ను మోంటానాకు చుట్టి చూపించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటి నుంచి దుబాయ్, మొరాకో, పారిస్ వంటి నగరాల్లో పలుమార్లు కలిసి కనిపించడంతో వారి సంబంధంపై ఊహాగానాలు బలపడ్డాయి. ఈ ఏడాది ఆరంభంలో పారిస్‌లో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్లలో చేతిలో చేయి వేసుకుని కనిపించడంతో వీరి ప్రేమ వ్యవహారం బహిర్గతమైంది.
 
షేఖా మహ్రాకు ఇదివరకే షేక్ మానా బిన్ మొహమ్మద్ వివాహమైంది. 2023 మేలో వీరి పెళ్లి జరగ్గా, వారికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, తన భర్త ద్రోహం చేశారంటూ ఆరోపిస్తూ గతేడాది ఇన్‌స్టా వేదికగా మహ్రా విడాకులు ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె "డివోర్స్" పేరుతో సొంతంగా పెర్ఫ్యూ బ్రాండ్‌ను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె యూకే విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ సంబంధాల విభాగంలో డిగ్రీ పట్టా పొందిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా వెళ్లే విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్