ఓ వైపు కరోనా... రష్యాలో భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 7.5గా నమోదు

బుధవారం, 25 మార్చి 2020 (15:56 IST)
రష్యాలో భూకంపం సంభవించింది. దేశంలోని కురీల్ దీవుల్లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రిక్టార్ స్కేల్‌పై 7.5గా నమోదైంది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే స్పష్టం చేసింది. 
 
రష్యన్ పట్టణానికి 219 కిలో మీటర్ల దూరంలోని కురీల్ దీవుల్లో.. 56.7 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని సైంటిస్టులు గుర్తించారు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. ఇలా ప్రకృతి భూకంపం రూపంలో పలుచోట్ల వణికిస్తోంది. ఇప్పటికే, క్రోయేషియా, గ్రీస్‌లలో గతవారం భూమి కంపించిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. గత ఆదివారం క్రోయేషియా రాజధాని జాగ్రెబ్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటకే అక్కడ కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమైపోయారు. 
 
ఈ క్రమంలో ఆదివారం భూకంపం రావడంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రిక్టార్‌ స్కెల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కాబూల్‌లోని గురుద్వారపై ఆత్మాహుతి దాడి-11 మంది మృతి