విశ్వంలోని సుదూర ప్రాంతంలో భూమిని పోలిన కొత్త గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి నుంచి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమికంటే సుమారు 70శాతం పెద్దది. దీనికి టాయ్-1452బీ అని నామకరణం చేశారు యూనివర్శిటీ ఆఫ్ మాంట్రియల్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు.
ఇది భూమి కంటే ఐదు రెట్లు బరువైనది. ఈ గ్రహంలో ఎక్కడ చూసినా దట్టంగా నీళ్లున్నాయి. గ్రహం మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రమే ఉంది. అందుకే దీన్ని సముద్ర గ్రహంగా పిలువొచ్చని శాస్త్రవేత్త కాడియక్స్ పేర్కొన్నారు.
ఈ గ్రహానికి తన నక్షత్రం నుంచి కాంతి అందుతుంది. ఈ కొత్త గ్రహంపై సంవత్సరం అంటే 11 రోజులే. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతుంది. దీనిపై ఇంకా విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని కాడియక్స్ తెలిపారు.