Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృత్రిమ వర్షంతో ఎండ నుంచి ఉపశమనం.. ఎక్కడ?

Advertiesment
Dubai
గతంలో మ‌న తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రువు స‌మ‌యంలో రాయలసీమ ప్రాంతాల్లో మేఘమథనం (కృత్రిమ వర్షం) చేపట్టారు. క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల కృత్రిమ వ‌ర్షాలు కురిపించే ప్ర‌య‌త్నం చేశారు. 
 
కానీ ఎడారి దేశ‌మైనా వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఎప్పుడూ ముందుండే యూఏఈ ఓ కొత్త టెక్నాల‌జీని ఉప‌యోగించి కృత్రిమ వ‌ర్షం కురిపించింది. దేశంలో ఎండ‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ను కూడా తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు దుబాయ్ ఓ వినూత్న ప్ర‌య‌త్నం చేసింది.
 
ఈ కొత్త టెక్నాల‌జీలో భాగంగా డ్రోన్ల సాయంతో మేఘాల‌కు షాకిచ్చి కృత్రిమ వ‌ర్షం కురిపించింది. దుబాయ్‌లోని ఓ హైవేపై ఇలా వ‌ర్షం కురుస్తున్న వీడియో వైర‌ల్‌గా మారింది. కొన్నేళ్లుగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపించి క్లౌడ్ సీడింగ్ ద్వారానే యూఏఈ కృత్రిమ వ‌ర్షాలు కురిపిస్తోంది. 
 
ఈ డ్రోన్లు మేఘాల్లోకి విద్యుత్తును పంపిస్తాయి. అది కాస్తా మేఘాల్లో ఎల‌క్ట్రిక‌ల్ బ్యాలెన్స్‌ను మార్చి వ‌ర్షం కురిపిస్తాయి. మేఘాల్లోని వ‌ర్ష బిందువుల‌ను చార్జ్ చేయ‌డానికి తాము ఇలా డ్రోన్ల‌ను పంపిస్తున్న‌ట్లు ఈ ప్రాజెక్ట్‌పై ప‌ని చేసిన శాస్త్రవేత్త డాక్ట‌ర్ కెరి నికోల్ చెప్పారు. ఈ కొత్త టెక్నాల‌జీ యూఏఈలో వ‌ర్ష‌పాతాన్ని పెంచుతుంద‌ని భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేఘాలకు షాకిచ్చి వాన తెప్పించారు.. వారెవ్వా అదుర్స్..! (video)