Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళ డ్రైవర్‌కు జాక్‌పాట్ : రాత్రికి రాత్రే కోటీశ్వరుడు... ఎలా?

Advertiesment
కేరళ డ్రైవర్‌కు జాక్‌పాట్ : రాత్రికి రాత్రే కోటీశ్వరుడు... ఎలా?
, సోమవారం, 5 జులై 2021 (08:04 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ డ్రైవర్‌కు జాక్‌పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరడయ్యాడు. తొమ్మిది మంది స్నేహితులతో కలిసి కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్‌ వారిని కోటీశ్వరులు చేసింది. ఆ లాటరీ టిక్కెట్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కష్టాలన్నీ తీరిపోయాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పొట్టకూటి కోసం కేరళకు చెందిన సోమరాజన్ అబుదాబికి వెళ్లాడు. ఈయన అబుదాబిలో గత 2008 నుంచి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అయితే, 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ మూడేళ్లుగా లాటరీ టికెట్లు క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో గత నెల 29న తన సహచరులైన 9 మందితో కలిసి తలా 100 దిర్హమ్‌లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్‌కు 3 కోట్ల దిర్హమ్‌లు (దాదాపు 40 కోట్లు) తగిలాయి. 
 
జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసి ఉప్పొంగిపోతున్న సోమరాజన్ మాట్లాడుతూ.. తొలుత ఈ విషయాన్ని నమ్మలేని అతడు ఆ తర్వాత తనకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నాడు. పైగా, తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉచిత బియ్యం పంపిణీతో రూ.2,100 కోట్ల భారం