Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా మీడియాకు ట్రంప్ 'చెత్త' అవార్డు... అవాక్కవుతున్న జర్నలిస్టులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో మళ్లీ ఫైర్ అయ్యారు. అయితే ఈసారి ఏదో ఒక దేశం మీద కాకుండా, అమెరికాకే చెందిన ప్రధాన మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడి ఎన్నిక

Advertiesment
అమెరికా మీడియాకు ట్రంప్ 'చెత్త' అవార్డు... అవాక్కవుతున్న జర్నలిస్టులు
, గురువారం, 4 జనవరి 2018 (16:07 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో మళ్లీ ఫైర్ అయ్యారు. అయితే ఈసారి ఏదో ఒక దేశం మీద కాకుండా, అమెరికాకే చెందిన ప్రధాన మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండే ట్రంప్‌కు, మీడియాకు మధ్య వైరం కొనసాగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
 
అత్యంత అవినీతి, కపట మీడియా అవార్డ్‌లను జనవరి 8, సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటిస్తానని ట్విట్టర్ వేదికగా ట్రంప్ ప్రకటించారు. బూటకపు వార్తలు ప్రచురించిన అబద్ధపు వార్తా సంస్థలకు వివిధ కేటగిరీల్లో అవార్డ్‌లు ఇస్తానని చెప్పారు. ఈ విభాగాల్లో చెత్త రిపోర్టింగ్, కపటత్వం ప్రధానంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ అవార్డుల నుండి ఫాక్స్ న్యూస్‌ని మినహాయించడం విశేషం.
 
వార్తల కవరేజీలో అత్యంత బూటకంగా, పూర్తి అవినీతితో వ్యవహరించిన మీడియా ఏదో తేల్చాలని, విజేతకు ఫేక్ న్యూస్ ట్రోఫీ అందించాలని ఆయన గతేడాది నవంబర్ 27నే తొలసారిగా ప్రకటించారు. నవంబర్ 28న ట్రంప్ ప్రచారదళం 'కింగ్ ఆఫ్ ఫేక్ న్యూస్' ట్రోఫీ కోసం మెయిల్ ద్వారా నామినేషన్లను పంపమని ఆయన మద్దతుదార్లను కోరింది. ఇదంతా జరిగి నలభై రోజులు అయినప్పటికీ సోమవారం నాడు అవార్డులు ఇస్తానన్న ట్రంప్‌, అమెరికా మీడియాపై ఏ స్థాయిలో పగబట్టాడో ఇట్టే తెలిసిపోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్‌ ఎలా వుంటాడో నేరుగా నేను చూడలేదు: ముద్రగడ(వీడియో)