Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 February 2025
webdunia

క్షీణించిపోతున్న ఓజోన్ పొర

Advertiesment
క్షీణించిపోతున్న ఓజోన్ పొర
, శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (10:09 IST)
మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ (ఓజోన్‌ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది.

ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్‌ ప్రొటోకాల్‌పై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987, సెప్టెంబర్‌ 16న సంతకాలు చేశాయి.
 
ఆ తరువాత 1994, సెప్టెంబర్‌ 16న మరో సమావేశం జరిపి, ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారు. దాంతో ప్రతి సంవత్సం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించబడింది.

లక్ష్యం.
1, పర్యావరణ మార్పులపై, ఓజోన్ పొర క్షీణతపై ప్రజలకు అవగాహన కల్పించడం.
2 అన్ని దేశాల ప్రభుత్వాలు మాంత్రియల్‌ ప్రొటోకాల్‌ను మరింత సమర్థంగా అమలుచేసి 2050 సంవత్సరానికి ఓజోన్‌ పొరను 1980కు ముందున్నస్థాయికి తేవడం

అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేయడం, మొక్కలను పెంచడం, యంత్రాల నుంచి వినాశకర వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమలు రక్షణ చర్యలు చేపట్టడం.
 
1980లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొరకు రంధ్రం ఏర్పడిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ప్రొటోకాల్‌పై సంతకం చేసిన 30 సంవత్సరాల తరువాత ఓజోన్ పొరలో రంధ్ర పరిమాణం తగ్గడం గమనించబడింది.

ఓజోన్ క్షీణతకు కారణమయ్యే వాయువుల స్వభావం కారణంగా వాటి రసాయన ప్రభావాలు 50 నుండి 100 సంవత్సరాల వరకు కొనసాగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనార్టీ సబ్ ప్లాన్ రాజ్యాంగ విరుద్ధం...ఆపేయండి!