Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు నుంచి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

రైలు నుంచి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (20:33 IST)
north korea
ఉత్తర కొరియా మళ్లీ వరుస క్షిపణి ప్రయోగాలతో హడలెత్తిస్తోంది. ఇప్పటికే రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి అమెరికా, దాని మిత్రదేశాలను కవ్వించిన ఉత్తర కొరియా.. గురువారం మరో క్షిపణిని పరీక్షించి ఇరుదేశాల ఉద్రిక్తలకు మరింత ఆజ్యం పోశారు. తొలిసారి ఓ రైలు నుంచి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది.
 
దట్టమైన పర్వత మధ్య ప్రాంతంలో ఉన్న రైలు వద్దకు.. ఆయుధ వ్యవస్థను తరలించి అక్కడి నుంచి విజయవంతంగా... క్షిపణిని పరీక్షించినట్లు చెప్పింది. రైలు నుంచి ప్రయోగించిన ఈ బాలిస్టిక్‌ క్షిపణి.. 800 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న లక్ష్యాన్ని చేధించినట్టు కొరియన్‌ మీడియా పేర్కొంది. రైలు నుంచి వరుసగా రెండు క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించిందని తెలిపింది. దక్షిణ కొరియా తీరానికి సమీపంలోనే ఈ క్షిపణులు చేరినట్టు తెలుస్తోంది.
 
అటు, ఉత్తర కొరియాకు దీటుగా దక్షిణ కొరియా సబ్-మెరైన్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దీంతో అణ్వాయుధాల లేకుండా జలాంతర్గామి నుంచి క్షిపణిని ప్రయోగించిన మొట్టమొదటి దేశంతో గుర్తింపు పొందింది. ఈ క్షిపణి పరీక్షకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ కూడా హాజరయ్యారు. ఉత్తర కొరియా పరీక్షించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు తూర్పు తీరంలో ల్యాండ్ అయినట్టు జపాన్, దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఇద్దరు విద్యార్థుల ఖాతాలో రూ.960 కోట్లు.. ఎగిరిగంతేశారు.. అంతే..?