Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనార్టీ సబ్ ప్లాన్ రాజ్యాంగ విరుద్ధం...ఆపేయండి!

మైనార్టీ సబ్ ప్లాన్ రాజ్యాంగ విరుద్ధం...ఆపేయండి!
విజయవాడ , శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (10:06 IST)
మతం ఆధారంగా సబ్ ప్లాన్ అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు అభివర్ణించారు. వైకాపా ప్రభుత్వం అమలుచేయనున్నమైనార్టీ సబ్ ప్లాన్ అమలును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం హిందూమతాన్ని అవమానించి, అన్య మతస్తులను అందలాలెక్కించడం మానుకోవాలని సూచించారు. వినాయక చవితిపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, గతేడాది పోలీస్ స్టేషన్లో రాష్ట్ర పండుగ‌లా క్రిస్మస్ చేసుకోవడం మైనార్టీలకు సంతుష్టీకరణ కోసమే అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను నిస్సిగ్గుగా అమలు చేయడాన్ని చూస్తే జాలేస్తుంది. అనేక సందర్భాల్లో మైనార్టీలను ప్రసన్నం చేసుకునే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో భాగంగానే పార్టీ నాయకులు టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని నిర్మించి తీరుతామని ప్రగల్భాలు పలికారు. దేశ నాయకులు స్వాతంత్ర సమరయోధులు లేనటువంటి వల్లమాలిన ప్రేమ ఈ రాష్ట్రానికి సంబంధం లేని ఈ రాష్ట్రానికి చెందిన ముస్లిం ఛాందసవాది టిప్పుసుల్తాన్ పై చూపించడం ముస్లిం ఓటుబ్యాంకు కోసమేనని స్పష్టంగా తెలుస్తోంది. వినాయక చవితి ఉత్సవాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో చాలా శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా జరుపుకుంటే, ఈ రాష్ట్రంలో మాత్రం లేనిపోని నిబంధనలు పెట్టి  హిందువుల‌ను మోసం చేసింద‌ని జీవీఎల్ విమ‌ర్శించారు.
 
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయకుండా తుంగలో తొక్కుతూ, ఆ వర్గాలకు అన్యాయం చేస్తూ, మరోవైపు మైనార్టీ ఓట్లు గాలం వేయడం ప్రజావ్యతిరేక చర్య. హిందువుని మరోసారి అన్యాయం చేసే దిశగా అభివృద్ధి ఫలాలు కొన్ని వర్గాలకు పరిమితం చేసే ఆలోచనను భాజపా వ్యతిరేకిస్తుంద‌ని న‌ర‌సింహారావు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళగిరిలో డెంగ్యూ విజృంభణ