ఇరాన్ దేశాన్ని హిజాబ్ కుదిపేస్తోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు కదంతొక్కారు. ఈ సంఖ్య పదుల నుంచి వందలు, వందల నుంచి వేలు, వేల నుంచి లక్షల్లోకి చేరుకుంది. ఫలితంగా హిజాబ్ దెబ్బకు ఇరాన్ అట్టుడికిపోతోంది. ఈ ఆందోశలనపై ఇరాన్ సైనికులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా ఇప్పటివరకు 75 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో 22 యేళ్ల యువతిని ఇరాన్ పోలీసుల నైతిక విభాగం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమె తీవ్ర గాయాలతో మృతి. దేశంలోని 46 నగరాలు, పట్టణాలకు వ్యాపించిన నిరసనలు వ్యాపించాయి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నిన్న వేలాదిమంది ఆందోళనకారులు డెత్ టు ద డిక్టేటర్ అంటూ నినాదాలు చేశారు. మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ పాలనకు చరమగీతం పలకాలని నినదించారు.
అమిని మృతి తర్వాత దేశంలోని 46 నగరాలు, పట్టణాలు, గ్రామాలకు నిరసనలు పాకాయి. ఈ నెల 17న ప్రారంభమైన నిరసనల్లో ఇప్పటివరకు 41 మంది ఆందోళనకారులు, పోలీసులు చనిపోయినట్టు ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది. అమిని మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో విదేశీ కుట్ర ఉందన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది.