రష్యాను డెల్టా వేరియంట్ అతలాకుతలం చేస్తోంది. రోజుకు రికార్డు స్ధాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో 21,042 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 669 మంది మృతిచెందారు.
దేశంలో డెల్టా వేరియంట్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన అత్యధిక కోవిడ్ మరణాలు ఇవేనని అధికారులు వెల్లడించారు. రష్యాలో ఇప్పటివరకు 55,14,599 కేసులు నమోదుకాగా 1,35,214 మంది మృతిచెందారు.
యూరో 2020 ఫుట్ బాల్ టోర్నీకి(క్వార్టర్ ఫైనల్) ఆతిథ్యమిచ్చిన సెయింట్ పీటర్స్ బర్గ్ కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. దేశంలో కోవిడ్ కేసులు, మరణాలు మళ్లీ పెరిగిపోతున్న నేపథ్యంలో రష్యన్లందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ మరోసారి సూచించారు.