చైనాలో కరోనా కారణంగా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోవడం వంటి సమస్యల్లో ప్రజలు ఇరుక్కుంటున్నారు. తాజాగా ఉద్యోగం కోల్పోవడంతో మనస్తాపానికి గురైన చైనా మహిళ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయంలో వాష్‌రూమ్‌లో రేజర్‌తో ఆత్మహత్యకు ప్రయత్నించింది. టెర్మినల్ 3 వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. చైనీస్ మహిళ కౌలాలంపూర్‌కు విమానంలో వెళ్లాల్సి ఉంది. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె వాష్‌రూమ్‌కి వెళ్లి గొంతు, మణికట్టును కోసుకుంది" అని అధికారులు తెలిపారు.
దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తాను ఇటీవల ఉద్యోగం కోల్పోయానని, తన ప్రియుడితో విడిపోయానని మహిళ చెప్పింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.