Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో మరో వైరస్ గుర్తింపు - కోవిడ్-19తో పోలిస్తే తక్కువ సామర్థ్యం!

Advertiesment
china virus

ఠాగూర్

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (11:33 IST)
చైనాలో మరో వైరస్‍‌ పుట్టుకొచ్చింది. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్.కె.యు-5- కోవ్-2గా పేర్కొన్నారు. ఇది కోవిడ్-19కి కారణమైన సార్స్-సీవీవీ2ను పోలి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాన్ని హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తన కథనంలో పేరొంది. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే, ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్-19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
 
గబ్బిలాల్లో కరోనా వైరస్‌పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్‌ ఉమెన్‌గా గుర్తింపు పొందిన ప్రఖ్యాత వైరలాజిస్ట్‌ షీ ఝెంగ్ లీ ఈ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించారు. ఈ పరిశోధనకు సంబంధించి పరిశోధనా పత్రం సెల్ జర్నల్‌లో సమీక్షకు కథనంలో పేర్కొన్నారు. ఈ వైరస్‌ మెర్బెకో వైరస్‌తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ ఉప రకానికి చెందినదిగా శాస్త్రత్తలు గుర్తించారు. దీనిని హెచ్.కె.యు 5 కరోనా సంతతికి చెందినదిగా చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతుల నుండి టమోటాలను కొనుగోలు చేస్తుంది: అచ్చెన్నాయుడు