Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెచ్చగొడుతున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లో 11 ప్రాంతాల పేర్లు

Advertiesment
indochina border
, మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (14:40 IST)
డ్రాగన్ కంట్రీ చైనా నిత్యం భారత్‌పై బుసలు కొడుతుంది. గతంలో పలుమార్లు కవ్వింపులకు పాల్పడిన చైనా ఇపుడు మరోమారు తన వక్రబుద్ధిని చూపింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న చైనా... ఇపుడు ఆ ప్రాంతాల పేర్లను మారుస్తుంది. తాజాగా 11 ప్రాంతాల పేర్లను మార్చింది. చైనీస్, టిబెటిన్, షిన్యన్ అక్షరాలతో వీటి పేర్లను విడుదల చేసింది. ఇది మూడో విడత చర్యలో భాగంగా ఈ ప్రాంతాలను ఎంచుకుంది. 
 
చైనా మంత్రివర్గం జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలను అనుసరించి చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా చైనీస్, టిబెటన్, షిన్యిన్ అక్షరాలతో ప్రామాణిక పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు భూభాగాలను, ఐదు పర్వత శిఖరాలను, రెండు నదులతో పాటు సబార్డినేట్ అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. 
 
2017లో తొలి విడతలో ఆరు ప్రాంతాలకు, 2021లో రెండో విడతలో 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. ఇపుడు మూడో విడతగా 11 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టబోతున్నట్టు రాసుకొచ్చింది. పైగా, ఈ పేర్ల ప్రకటన చట్టబద్ధమైన చర్య అని, అది చైనా సార్వభౌమ హక్కు అని చైనా నిపుణులను ఉటంకిస్తూ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు సీఎం జగన్‌తో బెడిసికొట్టింది.. ఇక రాం రామేనా?