Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగ్లా రాజధాని ఢాకాలో పేలుడు - ఏడుగురు మృతి

Advertiesment
బంగ్లా రాజధాని ఢాకాలో పేలుడు - ఏడుగురు మృతి
, సోమవారం, 28 జూన్ 2021 (10:53 IST)
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు మృతి, 70 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి ఓ బస్సు కూడా ధ్వంసమైంద. సమాచారం తెలియగానే ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ షపీఖుల్ ఇస్లామ్ ఘటనా స్థాలానికి వెళ్లి పరిశీలించారు. 
 
అయితే, బాంబు పేలుడు లేదా ఉగ్రదాడి జరిగినట్లుగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవని ఆయన తెలిపారు. గ్యాస్ లీకేజీ లేదా సిలిండర్ పేలుడు వల్లే ఘటన జరిగి ఉండచ్చవని వెల్లడించారు. ఈ పేలుడు ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించిందని ఆయన తెలిపారు. 
 
రాజధానిలోని మోగ్‌బజార్ వైర్‌లెస్ గేట్ ఏరియా ప్రాంతంలో రాత్రి 8 గంటల సమయంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 70 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 29 మందిని ఢాకా మెడికలల్ కాలేజికి, 10 మందిని నేషనల్ బర్న్ అండ్ ప్లాస్టిక్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. మిగతా వారిని ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
రాత్రి 10.30 గంటల సమయంలో ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ షపీఖుల్ ఇస్లామ్ ఘటనా స్థాలానికి వెళ్లి పరిశీలించారు. ఐతే బాంబు పేలుడు లేదా ఉగ్రదాడి జరిగినట్లుగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవని ఆయన తెలిపారు. గ్యాస్ లీకేజీ లేదా సిలిండర్ పేలుడు వల్లే ఘటన జరిగి ఉండచ్చవని వెల్లడించారు. స్థానికులు మాత్రం ఎయిర్ కండిషనర్ పేలిపోయినట్లుగా చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భయపెడుతున్న కొత్త వైరస్... ఊపిరితిత్తులపై కన్నేసిన డెల్టాప్లస్