Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేకపై ఐదుగురు అత్యాచారం.. మేకలు కూడా అలాంటి దుస్తులు ధరించాలా?

మేకపై ఐదుగురు అత్యాచారం.. మేకలు కూడా అలాంటి దుస్తులు ధరించాలా?
, శుక్రవారం, 30 జులై 2021 (10:59 IST)
Goat
సమాజంలో అవమానీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలపై దారుణాలకు తెగబడుతున్న కామాంధులు.. జంతువులను కూడా వదలడం లేదు. తాజాగా ఓ మేకపై…కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భారత్ పొరుగు దేశం పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే… ఒకరా జిల్లాలోని ఓ కార్మికుడి ఇంటి ముందున్న మేకను ఐదుగురు వ్యక్తులు అపహరించారు. ఒకరి తర్వాత.. మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మేకను చంపేశారు. అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. 
 
వీరు పారిపోవడాన్ని అక్కడనే ఉన్న స్థానికులు చూశారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. అఘాయిత్యాన్ని వ్యతిరేకిస్తూ.. సోషల్ మీడియాలో తమ నిరసనలు తెలియచేస్తున్నారు.
 
పోస్టుల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తున్నారు. పీఎం గారు.. మేకలు కూడా వాటి వస్త్రాధరణ కారణంగానే అత్యాచారానికి గురవుతున్నాయి కదా అంటూ.. వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. గత నెలలో ఇమ్రాన్ ఖాన్ మహిళల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఆడవారు పూర్తిగా వస్త్రాలు ధరించాలని, వారి వేషధారణ ఎదుటివారిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదంటూ… ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఉచిత సలహాలు ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్