Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సౌతాఫ్రికాలో విషాదం : గ్యాస్ లీక్ - 16 మంది మృత్యువాత

సౌతాఫ్రికాలో విషాదం : గ్యాస్ లీక్ - 16 మంది మృత్యువాత
, గురువారం, 6 జులై 2023 (13:21 IST)
సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ మురికివాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో గ్యాస్ లీక్ కావడంతో 16 మంది వరకు చనిపోయారు. మరికొందరు అస్వస్థతకు లోనయ్యారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ గ్యాస్ సీల్‌కు అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబందం ఉండి వుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 
 
ఈ సంఘటన స్థలంలో గ్యాస్ లీక్ అయిన కారణంగా ఊపిరి ఆడక చనిపోయిన వారి మృతదేహాలు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడివున్నాయని గౌటెంక్ ప్రావిన్స్ ప్రీమియర్ పన్యాజా లెసుఫీ చెప్పారు. ఈ విషాద సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జోహన్నెస్‌బర్గ్ అధికారులు వెల్లడించారు. 
 
ఒక్క ట్వీట్‌తో పేటీఎం బ్యాచ్‌ గుండెల్లో గునపం దింపిన పవన్   
 
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఏపీలోని అధికార వైకాపాకు చెందిన పేటీఎం బ్యాచ్ ఈ అసత్య ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఒక దశలో నిజమేనా అనేలా చేసింది. ఈ ప్రచారంపై జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అదేసమయంలో పవన్ కళ్యాణ్ తనదైనశైలిలో బదులిచ్చారు. ఒకే ఒక్క ట్వీట్‌తో పేటీఎం బ్యాచ్‌ గుండెల్లో గునపం దించారు. 
 
ఇదే అంశంపై జనసేన పార్టీ చేసిన ఓ ట్వీట్‌తో పేటీఎం బ్యాచ్‌ దుష్ప్రాచారానికి తాళం పడింది. "జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, అనా కొణిదెల - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ నగరంలోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరి చేరుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన : బాధితుడి పాదాలు కడిగి క్షమాపణలు చెప్పిన సీఎం శివరాజ్